![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ ఎపిసోడ్-23 లోకి అడుగుపెట్టింది. కాగా శనివారం నాటి ఎపిసోడ్ లో.. కనకం అక్క మీనాక్షి ఇంటికి రాజ్ ఫ్యామిలీ పెళ్లిచూపులకి రావడంతో వాళ్ళని ప్రేమగా ఆహ్వానించింది. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తడబడుతూ నోరుజారుతుంటుంది కనకం.
మరోవైపు కావ్య చేసిన పిండివంటలను రాజ్ ఫ్యామిలీ కంటపడకుండా చాటుగా తీసుకువెళ్తుండగా.. అప్పుడే ఫోన్ మాట్లాడడానికి బయటకు వచ్చిన రాజ్ చూసుకోకుండా కావ్య కి డాష్ ఇస్తాడు. రాజ్, కావ్య ఇద్దరు పడిపోతుండగా ఒకరికొకరు పడిపోకుండా పట్టుకుంటారు. ఆ తర్వాత రాజ్ మాటల యుద్ధం మొదలైంది. మరొకవైపు ఇప్పుడు గొడవ ఎందుకని కావ్య సైలెంట్ గా ఉంది. రాజ్ తో పాటు అతని తల్లి కూడా ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళినా నీతో గొడవ అయిపోయిందని అంటుంది. "నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్.. ఈ అమ్మాయి మీకు తెలుసా" అని కావ్య గురించి కనకంని అడుగుతుంది రాజ్ తల్లి. అప్పుడు కనకం ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదు అని చెప్తుంది. కృష్ణమూర్తి గారికి నేనే బొమ్మలకు డిజైన్ వేసి పంపిస్తాను. వాటి తాలూకా డబ్బుల కోసం వచ్చానని చెప్తుంది. "అవును నిజమే.. తను మా కూతురులాంటిదండి.. తననేం అనకండి" అని రాజ్ ఫ్యామిలీతో కృష్ణమూర్తి అంటాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న మీనాక్షి పనిలో సాయం చేద్దువు రా అమ్మా అని కావ్యని లోపలికి తీసుకువెళ్తుంది.
లోపలకి వెళ్లిన కృష్ణమూర్తి ఏంటే కన్నకూతురుని పరాయి దాన్ని చేసావ్ అంటూ కనకంని తిడతాడు. కనకం, కావ్యకి సారి చెప్పి పిండివంటలు అందరికి ఇవ్వమని పంపిస్తుంది. మరోవైపు రాహుల్ ప్రేమలో స్వప్న పూర్తిగా మునిగిపోతుంది. రాజ్ ని పెళ్లి చేసుకుంటే ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవాలి.. రాహుల్ ని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది.. ఎలాగైనా రాహుల్ ని పెళ్లి చేసుకోవాలని స్వప్న అనుకుంటుంది. పిండి వంటలు తీసుకొని రాజ్ ఫ్యామిలీ ముందుకు కావ్య వెళ్తుంది. తన చేత్తో ఇస్తే ఎవరు తీసుకోరని స్వప్న చేసింది అనగానే.. రాజ్ ఒక్కడే తీసుకొని తింటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |